ETV Bharat / city

గాంధీభవన్​లో కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ - కరోనా వైరస్‌

కొవిడ్‌-19పై ప్రత్యేకంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ పార్టీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులు, ఇతర సీనియర్‌ నాయకులతో కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి, ఉత్తమ్​ మాట్లాడారు.

congress task force committee meeting on covid 19
గాంధీభవన్​లో కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ
author img

By

Published : Apr 13, 2020, 12:34 PM IST

కొవిడ్‌-19పై ప్రత్యేకంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ పార్టీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రెండోసారి గాంధీభవన్‌లో సమావేశమైంది. ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి అధ్యక్షతన మొదలైన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులు హాజరయ్యారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులు, ఇతర సీనియర్‌ నాయకులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 స్థితిగతులు, ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు, కరోనా వైరస్‌ వ్యాప్తి, నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఒక్కొక్కరికి మూడు అడుగులకంటే ఎక్కువ దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: వైరస్​పై సీసీఎంబీ బహుముఖ యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.