ETV Bharat / city

CM KCR Jharkhand Tour: కాసేపట్లో ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌ - compensation for Galwan Martyrs

CM KCR Jharkhand Tour: ముఖ్యమంత్రి కేసీఆర్​... ఝార్ఖండ్ రాజధాని రాంచీకి కాసేపట్లో వెళ్లనున్నారు. గాల్వాన్ అమరులకు పరిహారం అందించనున్నారు. రాంచీలో అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.

CM KCR Jharkhand Tour
CM KCR
author img

By

Published : Mar 3, 2022, 9:18 PM IST

Updated : Mar 4, 2022, 10:29 AM IST

CM KCR Jharkhand Tour: గాల్వాన్ అమరులకు ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్​బాబు సహా మరో 19 మంది వీరమరణం పొందారు. సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

2020 జూన్ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్​బాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిహారంతో పాటు సంతోష్​బాబు సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

CM KCR Jharkhand Tour: మిగిలిన 19 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. అమరులైన వారిలో బిహార్​కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబంగ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సీఎం కేసీఆర్​.. ఈరోజు దిల్లీ నుంచి నేరుగా రాంచీ వెళ్లి.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్​తో కలిసి ఆయన అధికారిక నివాసంలో చెక్కులను అందించనున్నారు. ఇద్దరు అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు చెక్కులను అందజేయనున్నారు.

ఇదీచూడండి: KCR Meet Tikait: 'ఫ్రంట్​ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '

Last Updated : Mar 4, 2022, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.