తెలంగాణ ప్రజలను వంచించిన నిజాంను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పొగడటం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 2023లో భాజపా అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
తమ అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకునేందుకే ఎల్‌ఆర్ఎస్‌ను కేసీఆర్ తీసుకువచ్చారని ఆరోపించారు. తెల్లపాస్‌బుక్‌ను నల్ల పాస్‌బుక్కుగా మార్చడం తప్ప కొత్త రెవెన్యూ చట్టం విషయంలో చేసేందేమిలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్ అరెస్టు