ETV Bharat / city

Liquor Sales Telangana 2021 : ఇది తెలంగాణ మందుబాబుల ఆల్​టైం రికార్డ్! - మద్యం విక్రయాల్లో తెలంగాణ రికార్డ్

Liquor Sales Telangana 2021 : 'తాగడం మొదలుపెడితే మాకంటే పెద్ద తాగుబోతులెవరూ లేరిక్కడ. ఒక్కసారి బీర్ బాటిల్​ ఎత్తామంటే.. ఖాళీ అయ్యే వరకు దించం. ఫ్యామిలీతో కూర్చుంటే.. ఫుల్​ బాటిల్ లేవాల్సిందే. అదే దోస్తులతో దావత్​ అయితే కేసు బీర్లు అలా అయిపోవాల్సిందే. ఇదంతా ఒక్క గంటలోనే. ఇది మా ట్రాక్ రికార్డు కాదు.. ఇట్స్ అవర్ ఆల్​టైం రికార్డ్' అంటున్నారు తెలంగాణలో మందుబాబులు. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఆల్​టైం రికార్డ్ సృష్టించబోతున్నాయి.

Liquor Sales Telangana 2021
Liquor Sales Telangana 2021
author img

By

Published : Dec 24, 2021, 8:01 AM IST

Updated : Dec 24, 2021, 8:32 AM IST

Liquor Sales Telangana 2021 : రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఆల్‌టైం రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. డిసెంబరులో ఏకంగా రూ.3 వేల కోట్లకు అమ్మకాలు చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక నెలలో గరిష్ఠంగా రూ.2,800 కోట్లలోపు మద్యం విక్రయాలు జరిగాయి. అదీ గత డిసెంబరులోనే.. దసరా నెల విక్రయాలకంటే అధికంగా మద్యం అమ్ముడుపోయింది.

All Time Record in Telangana Liquor Sales : ఈ నెలలో గురువారం సాయంత్రం నాటికే రూ.2,320 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే సగటున రోజుకు రూ.100 కోట్ల చొప్పున మద్యం అమ్ముడుపోయింది. ఇంకా వారం మిగిలి ఉండటంతో పాటు నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సులభంగానే రూ.3 వేల కోట్ల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నారు. హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో బహిరంగంగా వేడుకలు ఉండకపోయినా.. మద్యం విక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో మద్యం విక్రయాలు

ఇవీ చదవండి :

Last Updated : Dec 24, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.