ETV Bharat / city

Minister Niranjan Reddy: 'తగ్గించిన కోటాను మార్చిలోగా పంపించండి' - minister Niranjan reddy letter to central over fertilizer

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర ఎరువుల మంత్రి మాండవీయకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture Minister Niranjan Reddy) లేఖ రాశారు. అక్టోబర్, నవంబర్​లో తక్కువగా సరఫరా చేశారన్న మంత్రి.. డిసెంబర్ నుంచి మార్చి వరకు సరఫరాలో ఆ కోటాను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy
author img

By

Published : Nov 9, 2021, 11:49 AM IST

రాష్ట్ర అవసరాలకనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి(Telangana agriculture Minister Niranjan Reddy) కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేంద్రం కేటాయించినట్లు గుర్తుచేశారు.

రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులో కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించినట్లు నిరంజన్‌రెడ్డి(Telangana agriculture Minister Niranjan Reddy) చెప్పారు. అక్టోబరు, నవంబరు మాసాలకు 6.4 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ.. కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కేటాయించినట్లు లేఖలో పేర్కొన్నారు. కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేసినట్లు తెలిపారు.

కేంద్ర కేటాయింపుల ప్రకారమే ఇంకా 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రావాల్సి ఉందన్న మంత్రి(Telangana agriculture Minister Niranjan Reddy).. ఇతర దేశాల నుంచి వచ్చిన నౌకల నుంచి.. ఎరువులు కేటాయించాలని కోరారు. గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విన్నవించారు. కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్​సీఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్​కు చెందిన నౌకల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని కోరారు. క్రిబ్ కో కంపెనీ నుంచి 2 అదనపు రేక్‌ల యూరియా కేటాయించాలని.... అక్టోబర్, నవంబర్ నెలల్లో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture Minister Niranjan Reddy)పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.