ETV Bharat / city

MANSAS TRUST: చీకటి జీవోలిచ్చే సర్కార్​కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు - చంద్రబాబు వార్తలు

మాన్సాస్ ట్రస్టు(MANSAS TRUST) ఆధ్వర్యంలోని దేవాలయ ఆస్తులు, వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న ఏపీ సీఎం ప్రయత్నాలకు.. న్యాయం, చట్టం అడ్డుకట్ట వేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చీకటి జీవోలు కోర్టు బోనులో వీగిపోయాయని అభిప్రాయపడ్డారు.

lokesh
మాన్సాస్ ట్రస్టు
author img

By

Published : Jun 14, 2021, 5:27 PM IST

మాన్సాస్ ట్రస్టు (MANSAS TRUST) ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తులు, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM JAGAN) దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(CHANDRABABU NAIDU) అభిప్రాయపడ్డారు. కోర్టుతీర్పుతో అయినా జగన్ రెడ్డి మూర్ఖత్వం వీడి గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి హైకోర్టు కనువిప్పు కలిగించిందన్నారు.

"సింహాద్రి అప్పన్న అండతో న్యాయం ధర్మం చట్టం ఏకమై జగన్ రెడ్డి తాట తీస్తాయని గుర్తించాలి. న్యాయస్థానాల్లో ఏ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు తలంటించుకోలేదు. ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్ సీఎంకి చెంపపెట్టు. అప్రజాస్వామికంగా చీకటి జీవోలెన్ని ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని రుజువైంది. గజపతి రాజుల వంశ ప్రతిష్టకు మసిపూయాలనుకున్న ఏ-1 రెడ్డి దుర్మార్గాన్ని నిలువరించి పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మందికి హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చింది. వేతనాలు కూడా చెల్లించకుండా పెడుతున్న ఇబ్బందుల నుంచి స్వాంతన కల్పించింది. అధికారం ఉందని అడ్డగోలు జీవోలిస్తే, న్యాయం, చట్టం చూస్తూ ఉండవని రుజువైంది. ట్రస్టును కాపాడుకునేందుకు అశోక్ గజపతిరాజు అలుపెరుగనని న్యాయ పోరాటం చేశారు." తెదేపా అధ్యక్షుడు- చంద్రబాబు నాయుడు.

మాన్సాస్ ట్రస్ట్‌(MANSAS TRUST) కేసులో న్యాయమే గెలిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి చీక‌టి జీవోలిచ్చే జగన్ రెడ్డి సర్కార్​కు హైకోర్టు తీర్పు చెంపపెట్టని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(NARA LOKESH) ధ్వజమెత్తారు. మాన్సాస్ ట్రస్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంతో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయానిదే అంతిమ విజ‌యంగా తేలిందన్నారు.

భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజ‌ల కోసం దాన‌మిచ్చిన పూస‌పాటి వంశీకుల దాన‌గుణానికి, స‌త్యనిష్టకు న్యాయ‌స్థానం తీర్పు మ‌రింత వ‌న్నెతెచ్చిందని కొనియాడారు. అరాచ‌క ప్రభుత్వ పాల‌న‌పై.. సింహాచ‌లం అప్పన్న ఆశీస్సులతో, ప్రజాభిమానం, రాజ్యాంగం సాధించిన విజ‌యమిదని పేర్కొన్నారు. న్యాయ‌పోరాటం చేసి విజయం సాధించిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు అభినంద‌న‌లు తెలిపారు.

ఇదీ చదవండి: Bandi Sanjay : 'నియంత పాలన నుంచి ఈటలకు విముక్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.