ETV Bharat / city

Atchannaidu: జగన్​ అసమర్థ పాలన వల్లే చేనేతల ఆత్మహత్యలు: అచ్చెన్నాయుడు

Atchannaidu Fire on YSRCP Govt: ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. అసమర్థ పాలనతోనే చేనేత కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య బాధాకరమని.. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ATCHANNAIDU FIRE ON YSRCP GOVT
ATCHANNAIDU FIRE ON YSRCP GOVT
author img

By

Published : Feb 1, 2022, 4:39 PM IST

Atchannaidu on Handloom Workers Family Suicide at Pedana: ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య బాధాకరమని.. ప్రచార ఆర్భాటమే తప్ప జగన్ సర్కార్ ప్రజల్ని ఉద్దరించింది ఏం లేదని ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు ఇచ్చామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. సొంత మగ్గం లేకున్నా.. రిబేటు సహా ఏడాదికి లక్ష రూపాయల సహాయం, నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవని తెల్చిచెప్పారు.

అప్పటిలో ఆప్కో ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించామని.. నేడు పథకాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ లేదని మండిపడ్డారు. స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూంకు కట్టబెట్టారని అచ్చెన్న దుయ్యబట్టారు. అతి ప్రచారం, అసమర్థ పాలనతోనే చేనేత కుటుంబాల ఆత్మహత్యలకు పాల్పడ్డాయని.. పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: CM KCR comments on Budget: పసలేని బడ్జెట్.. గోల్‌మాల్‌ బడ్జెట్‌: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.