ANUSHA: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు.. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్లోని ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి.. తెదేపా మహిళా కార్యకర్తల చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నాడు.
అంతేకాకుండా ఆ వ్యక్తి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధించే సీఎం జగన్.. రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా మహిళల జోలికొస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. అటువంటి నీచరాజకీయాలు మానుకోని, మహిళల పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: