విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్ తొలి నుంచి చెబుతున్నదంతా అవాస్తవమని ఇప్పుడు స్పష్టమైందని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రే స్వయంగా తెలిపారన్నారు. ఓట్ల కోసమే పాదయాత్రల డ్రామాలు ఆడారని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలన్నారు. చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందగా.. ఇప్పుడు సీఎం కేంద్రానికి లేఖలు రాసి ఉపయోగం ఉండదన్నారు.
ఇదీ చదవండి: గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న తెరాస