ETV Bharat / city

రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజా ఉద్యమం: చంద్రబాబు

ఏపీలో వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకోసం మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజా ఉద్యమం: చంద్రబాబు
రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజా ఉద్యమం: చంద్రబాబు
author img

By

Published : May 6, 2022, 6:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో ప్రజా ఉద్యమం అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యమం కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి.. తెదేపా నాయకత్వం వహిస్తుందన్నారు. రాష్ట్రం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని.. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చంద్రబాబు వెల్లడించారు.

క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’: రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్‌ కంకణం కట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొని.. మాట్లాడారు. ఈ సందర్భంగా ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ఆయన పిలుపునిచ్చారు.

సజ్జల స్టేట్‌మెంట్లను హోంమంత్రి చదువుతున్నారు: ‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోం శాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్‌మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే.. జగన్‌ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు పడేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్‌ అంధకారం చేస్తున్నారు. కరెంట్‌ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్‌ రాదు కానీ.. బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ కొట్టిపారేశారు.

నాకు సీఎం పదవి కొత్త కాదు..:

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పదో తరగతి పరీక్షలను నిర్వహించలేని సీఎం.. 3 రాజధానులు కడతాడట. రాష్ట్రం నుంచి విదేశాలకు గంజాయి, డ్రగ్స్‌ పంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మరో ప్రజా ఉద్యమం అవసరం.. దీనికి అందరూ కలిసి రావాలి. ఆ ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుంది. నేను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదు. సీఎం పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో ఉన్న అందరూ పన్నులు కడుతున్నారు. వైకాపా శ్రేణులకు కూడా పన్నులు, ఛార్జీల బాదుడు ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి వైకాపా శ్రేణులు కూడా కలిసి రావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు అండగా ఉండాలని.. వాళ్లే ముందుండి నడిపించాలి.-చంద్రబాబు, తెదేపా అధినేత

ఇవీ చదవండి..:

ఖబడ్దార్‌... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్‌ గౌడ్‌

మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత... ఆత్మీయున్ని కోల్పోయానంటూ కేసీఆర్ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.