ETV Bharat / city

Chandrababu: 'యువతకు అండగా నిలిచిన పథకాల్ని జగన్​ సర్కార్​ రద్దుచేసింది' - ఏపీ తాజా వార్తలు

తమ ప్రభుత్వం యువతకు అండగా నిలిచేందుకు తెచ్చిన పథకాలన్నీ జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నుంచి యువతకు ప్రోత్సాహకాలు లేకపోగా ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు.. బతుకుదెరువు లేకుండా చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు.

Chandrababu
Chandrababu
author img

By

Published : Aug 12, 2021, 5:39 PM IST

తెగువకు, త్యాగానికి నిర్వచనమైన యువత... ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ హక్కుల్ని పోరాడి సాధించుకోవాలన్నారు. దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తుకు దిక్సూచి అయిన యువతీ యువకులకు చంద్రబాబు.. అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువత అభ్యున్నతే దేశాభ్యున్నతి అనేలా.. తెలుగుదేశం ప్రభుత్వం అడుగులేసిందని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్ధులకు విదేశీ విద్య అవకాశాలు అందించామని, ప్రతినెల నిరుద్యోగులకు భృతి అందించామని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో అండగా నిలిచామన్న చంద్రబాబు.. పెట్టుబడులను ఆహ్వానించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్​లో రెండేళ్లుగా కొత్తగా పైసా పెట్టుబడి రాలేదన్న ఆయన.. పరిశ్రమలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని మండిపడ్డారు.

యువ ముఖ్యమంత్రి అని ఆశపడితే..

యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు సీఎం జగన్‌ బతుకుదెరువు లేకుండా చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు లోకేశ్‌ అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెదేపా పాలనలో తెలుగు యువత ఎన్నో అద్భుత అవకాశాలను అందుకుందని, దేశ విదేశాల్లో తన సత్తా చాటిందన్నారు. అలాంటి యువశక్తిని రెండేళ్ల జగన్మోహన్​ రెడ్డి పాలన తీవ్రంగా నిరుత్సాహపరిచిందని విమర్శించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే తట్టుకోలేని యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు లేక బతుకు మీద భయంతో మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: Minister Harish Rao : 'రాష్ట్రం కుడి చేయితో ఇస్తే.. కేంద్రం ఎడమ చేత్తో తీసుకుంటోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.