ETV Bharat / city

ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ - VAT, GST news

రాష్ట్రంలో... వాణిజ్య పన్నుల శాఖ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వ్యాట్‌, జీఎస్టీ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. డిసెంబరు నెలలో ఏకంగా 17.31శాతం వృద్ధి నమోదుకాగా.. గడిచిన 9 నెలల్లో సగటు వృద్ధి రేటు 4.68శాతంగా నమోదైనట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

tax
ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ
author img

By

Published : Jan 7, 2021, 6:11 AM IST

రాష్ట్రంలో పన్నుల ఆదాయం అనూహ్యంగా పెరిగింది. డిసెంబరు నెలలో వ్యాట్‌తోపాటు, జీఎస్టీ రాబడులు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి బయటపడి.. క్రమంగా పన్నుల వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు నెలలో వసూళ్లు ఏకంగా 27శాతానికి పైగా వృద్ధి నమోదు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్‌ కారణంగా గత ఏడాది మార్చి చివర వారం నుంచి.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో జీఎస్టీ, వ్యాట్‌ రాబడులపై తీవ్ర ప్రభావం పడింది.

రూ.నాలుగు నుంచి నాలుగున్నర వేల కోట్లు..

లాక్‌డౌన్‌ సమయంలో వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి.. నిర్వహణ సైతం భారంగా మారింది. ఆ తర్వాత క్రమంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. పన్నుల వసూళ్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రతి నెలా రూ.4 వేల నుంచి రూ.4.5 వేల కోట్ల రూపాయలు వ్యాట్‌, జీఎస్టీ వసూళ్లు కావాల్సి ఉండగా.. కరోనా సమయంలో అవి నాలుగో వంతుకు పడిపోయాయి. గతేడాది జూన్‌ నెల మినహాయిస్తే.. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు పన్నుల వసూళ్లు పడిపోయాయి. సెప్టెంబరు నుంచి వ్యాట్‌, జీఎస్టీ వసూళ్లలో క్రమంగా వృద్ధి కనపడుతూ వస్తోంది.

రాబడులు తీరు..

వాణిజ్య పన్నుల శాఖలో క్రమంగా పెరిగిన రాబడులు తీరును పరిశీలించినట్లయితే.. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ.932.54 కోట్లు రాగా.. మే నెలలో రూ.1567.21 కోట్లు.. జూన్‌ నెలలో రూ.3,776.67 కోట్లు... జులై నెలలో రూ.3,786.21 కోట్లు.. ఆగస్టు నెలలో రూ.3935.50 కోట్ల లెక్కన ఆదాయం వచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.13,998.13 కోట్ల పన్నులు వసూళ్లుకాగా.. 2019లో ఇదే సమయంలో రూ.19.58 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అంటే రూ.5,59.87 కోట్ల మేర తగ్గినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో రూ.3,890.31 కోట్లు రాబడి వచ్చి అంతకుముందు ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే.. పది శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అదే గత ఏడాది అక్టోబరు నెలలో రూ.4,957.49 కోట్లు ఆదాయం వచ్చి.. అంతకు ముందు ఏడాది.. అదే నెలలో వచ్చిన మొత్తంతో పోలిస్తే 58శాతం వృద్ధి కనపరచినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

4.68 శాతం ఎక్కువ..

గతేడాది నవంబరులో రూ.6,876.51 కోట్ల మేర రాబడి రాగా.. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో వచ్చిన రాబడుల కంటే ఏకంగా 77శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది డిసెంబరు నెలలో రూ.5,812.11 కోట్లు వసూలు అయ్యి.. అంతకుముందు ఏడాది కంటే 27.31శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు వసూళ్లు అయిన వ్యాట్‌, జీఎస్టీల రాబడులు మొత్తం రూ. 35,534.55 కోట్లు కాగా 2019లో ఇదే సమయంలో వచ్చిన రాబడులు కంటే.. ఇది 4.68 శాతం ఎక్కువని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో.. పెట్రోల్‌ అమ్మకాలు, మద్యం విక్రయాలపై వ్యాట్‌ రాబడులు రూ.13,954 కోట్లు రాగా... మిగిలిన మొత్తం వస్తు సేవల పన్నుగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ప్రశ్నాపత్రంలో మార్పులకు ఇంటర్​బోర్డు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.