హైదరాబాద్ బేగంపేట్‌లోని లిస్బన్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు, పలువులు యువతీయువకులను ఆదుపులోకి తీసుకున్నారు. రూ.1.47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిర్ణీత సమయం దాటిన తర్వాత పబ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగా వచ్చిన యువకుల కోసం డ్యాన్సర్లను సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. యువతుల్ని వ్యభిచారంలోకి నెడుతున్నారనే ఆరోపణలతో పోలీసులు దాడులు చేశారు. గతంలోనూ పబ్ నిర్వాహకులపై కేసులు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: చైతన్యపురిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు