ETV Bharat / city

వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయం: భట్టి - తెలంగాణ వార్తలు

వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌ కంపెనీలకు లాభం తప్ప సాధారణ రైతులకు ఉపయోగం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 27న చేపట్టనున్న ఛలో హైదరాబాద్​కు రావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ మండలం మదన్​పల్లిలో రైతులతో నేరుగా మాట్లాడారు. వారి భూ సమస్యను శాసనసభలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.

Talked to farmers by bhatti vikramarka at Madanapalle in Vikarabad
వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయం: భట్టి
author img

By

Published : Feb 16, 2021, 9:39 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం వికారాబాద్‌ మండలం మదన్‌పల్లిలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మదన్​పల్లిలో 400ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వలేదని రైతులు తెలిపారు.

అన్ని పంటలకు ఇదే గతి :

వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌ కంపెనీలకు లాభం తప్ప సాధారణ రైతులకు ఉపయోగం లేదన్నారు. టమాటా రైతులు ధరలేక తమ పంటను రహదారుల పక్కన పారబోస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాలు అమలైతే భవిష్యత్తులో అన్ని పంటలకు ఇదే గతి పడుతుందన్నారు. సన్న ధాన్యం పండించాలని చెప్పి సీఎం ఇప్పుడు కొనుగోలు మాటెత్తడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.

ఛలో హైదరాబాద్‌:

ఈ నెల 27న కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి రైతు ట్రాక్టర్‌తో సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రులు శశిధర్ రెడ్డి, ప్రసాద్, మాజీ ఎంపీ మదుయాష్కీ, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, కోదండరెడ్డి, వికారాబాద్ ఎంపీపీ కళావతి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రుణ యాప్‌ సంస్థలపై విచారణలో వెలుగులోకి కొత్త ఖాతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.