గత 70 ఏళ్లుగా వంశపారపర్యంగా సాగుతున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సంలో ఏటా లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి కృపి పొందడం అనవాయితీ. ఈ నెల 23న ఈ వేడుకను కరోనా నేపథ్యంలో.. పురోహితుల సమక్షంలో మాత్రమే కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరుపనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
లాక్‌డౌన్ ఆంక్షల దృష్ట్యా భక్తులు, ఇతర ప్రజానీకం ఎవరూ వేడుకకు రావద్దని... పెండ్లి తంతు ప్రక్రియ అంతా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని మంత్రి తెలిపారు. భక్తులంతా సహకరించి తమ ఇళ్లల్లోనే టెలివిజన్ ఛానెళ్లల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో పశుసంవర్థక డైరెక్టరేట్‌లో మంత్రి సమీక్షించారు.
ఇదీ చూడండి: ఏడు వందల కోతులకు పునరావాసం