ETV Bharat / city

గ్రేటర్​పై తెరాస గురి.. గులాబీ సైన్యమంతా నగరంలోనే - గ్రేటర్ రంగంలోకి మంత్రులు

గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వ శక్తులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గులాబీ సైన్యం రాజధానిలో దిగబోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలందరికీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ప్రతి డివిజన్​కు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇంఛార్జ్​గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచర గణాన్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.

గ్రేటర్​పై తెరాస గురి.. గులాబీ సైన్యమంతా నగరంలోనే

author img

By

Published : Nov 17, 2020, 5:33 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగేందుకు గులాబీ సైన్యాన్ని సిద్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకూ ఇప్పటికే ఎన్నికల క్రతువులో నిమగ్నమయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కీలక కార్యకర్తలను జీహెచ్ఎంసీలో దించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేసింది. ఎంఐఎం బలంగా ఉన్న డివిజన్లు మినహా సుమారు వందకు పైగా డివిజన్లలో ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఎన్నికల బాధ్యతను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​కు అధినేత కేసీఆర్ అప్పగించారు. మిగతా మంత్రులందరూ గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి ప్రధాన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తూ... ఆ సెగ్మెంట్​లోని ఒక డివిజన్​కు ఇంఛార్జ్​గా ఉండనున్నారు. ప్రతి డివిజన్​కు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా ఎంపీ లేదా కార్పొరేషన్ ఛైర్మన్ లేదా సీనియర్ నేతను బాధ్యులుగా నియమిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఇంఛార్జ్​లుగా ఉన్న వారి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కీలక కార్యకర్తలు, అనుచర గణం కూడా గ్రేటర్​లో అడుగుపెట్టబోతోంది.

హరీశ్ షురూ..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాలు, డివిజన్లు అప్పగించడంలోనూ వివిధ సామాజిక, రాజకీయ సమీకరణలను తెరాస పరిగణనలోకి తీసుకుంది. ఏయే డివిజన్​లో ఎక్కువగా ఏ జిల్లాకు చెందిన వారున్నారు..? ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ప్రభావితం చేయనున్నారనే..? విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతలను అప్పగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పటాన్​చెరు నియోజకవర్గం బాధ్యత తీసుకున్న మంత్రి హరీశ్​ రావు... ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హూస్సేన్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,‌ అటవీ అభివృద్ధి ‌సంస్థ ఛైర్మన్ ఒంటేరు‌ ప్రతాప్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.

మంత్రుల కసరత్తు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డివిజన్ల గెలుపుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో భేటీ అయ్యారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీర్​పేట డివిజన్​లో అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్​తో పాటు... ఎంపీ పసునూరి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హన్మకొండలో సమావేశమై జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోషించాల్సిన పాత్రపై వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్​కు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని పలు డివిజన్ల బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు గులాబీ సైన్యం సిద్ధమవుతోంది.

ఇదీ చూడండి: 'త్వరలో కొత్త జీహెచ్​ఎంసీ చట్టం.. వరదలకు శాశ్వత పరిష్కారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.