ETV Bharat / city

వివేకా హ‌త్య కేసు నిందితుడికి బెయిల్ నిరాక‌రించిన సుప్రీం - ap latest news

SC ON VIVEKA MURDER: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్యకేసులో బెయిల్​ మంజూరు చేయాలన్న శివశంకర్​ రెడ్డి పిటిషన్​ను తోసిపుచ్చింది.

YS Viveka Murder Case
వివేకానంద హత్య కేసు
author img

By

Published : Sep 26, 2022, 4:06 PM IST

SC ON SHIVA SHANKAR BAIL PETITION : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ వేయగా.. బెయిల్‌ మంజూరు చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టుకు శివశంకర్​రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సెప్టెంబర్​ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.