SUPREME ORDERS TO AP GOVT: పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన పరిహారం రూ.250 కోట్లు వెంటనే జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం అంశం మినహా అన్ని అంశాలు అమలు చేయాల్సిందేనని తెలిపింది.
రూ.250 కోట్ల పరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచించింది. పోలవం ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనపై ఎన్జీటీ కమిటీ జరిమానా విధించగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఎన్జీటీ కమిటీ సిఫార్సుల యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: