కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం చెల్లింపు, పునరావాసంపై హైకోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది.
బాధితులను ఖాళీ చేయించడంలో అత్యుత్సాహం చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు.. గతంలో తీర్పు వెలువరించింది. రెండు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకు ప్రభుత్వం నివేదించింది. కొన్ని అంశాలను సరిగ్గా అన్వయించుకోలేదని తెలిపింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..