జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదని స్పష్టం చేసింది. పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం తీర్పు వెల్లడిచింది.
హైకోర్టు ఆదేశాలు..
మేజిస్ట్రేట్‌తో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్లో వివాదాస్పదంగా మాట్లాడారని హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్‌ను నియమించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు