ఏపీ సీఎం జగన్ తీరుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులపై సీఎం జగన్ ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే వేరే ధర్మాసనంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు జస్టిస్ సంజయ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం వెల్లడించింది. జగన్‌కు వ్యతిరేకంగా జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సహా యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్.. దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేసింది.
న్యాయమూర్తులపై ఆరోపణలతో లేఖ రాయడం, బహిర్గతం చేయడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. లేఖ బహిర్గతం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ లేఖపై కాలపరిమితితో అంతర్గత విచారణ చేయాలన్నారు. అభ్యర్థనలు గందరగోళంగా ఉన్నాయన్న జస్టిస్ కౌల్... లేఖ రాసి బహిర్గతం చేశాక విచారణ జరపాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అమరావతి భూముల అంశంలో ఇప్పటికే గ్యాగ్ ఆర్డర్‌ను సుప్రీం కోర్టు ఎత్తేసిందని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. సుప్రీం జడ్జిపై సీఎం జగన్ వ్యాఖ్యల అంశాన్ని ఆ పిటిషన్‌తో జత చేస్తున్నట్టు చెప్పారు. జనవరి చివరి వారంలో ఆయా పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్య స్ఫూర్తి: మెల్బోర్న్ వచ్చి... ఓటేశారు