CJI Justice NV Ramana About IAMC : హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సాగుతోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఐఏఎంసీ ట్రస్ట్ రూపకర్త జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దీనివల్ల నగరానికి మరింత పేరు వస్తుందని తెలిపారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ప్రాంతంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సింగపూర్ మాదిరి హైదరాబాద్ కేంద్రం ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు.
"ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సెంటర్ కోసం నగరంలో అత్యంత ఖరీదైన గచ్చిబౌలిలో భూమిని కేటాయించారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు కేసీఆర్ కూడా నమ్ముతారు. ఇవాళ ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి అవుతుందని అనుకుంటున్నాను. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారు."
- జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
IAMC Building Foundation : ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు, జస్టిస్ హిమాకోహ్లీ, హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : ఉప్పు ఉప్పెనలా మారితే.. వద్దన్నవారే వెంటవచ్చారు!