ETV Bharat / city

నిమ్మగడ్డ వ్యవహారంలో విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు - ap sec nimmagadda case news

ఏపీ ఎస్​ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ అఫిడవిట్​పై రీజాయిండర్​ దాఖలుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరినందున వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

supreme-court-adjourns-hearing-in-ap-sec-nimmagadda-case
నిమ్మగడ్డ వ్యవహారంలో విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 11, 2020, 8:04 PM IST

ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. నిమ్మగడ్డ అఫిడవిట్​పై రీజాయిండర్​ దాఖలుకు ఏపీ ప్రభుత్వం లేఖ ద్వారా నాలుగు వారాల గడువును కోరింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

నిమ్మగడ్డను తిరిగి ఎస్​ఈసీగా నియమిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తమకు ఏం జరుగుతుందో తెలుసంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్​ను తిరిగి ఎస్​ఈసీగా నియమించింది.

ఇవీ చూడండి: 'ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.