వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ట్యాంక్‌బండ్ మెరిసిపోతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో నగరవాసులు కుటుంబసమేతంగా ట్యాంక్‌బండ్ బాటపట్టారు. సందర్శకుల తాకిడితో ట్యాంక్ బండ్ మురిసిపోతోంది. సందర్శకులకు తగ్గట్టుగా అధికారులు ఆహ్లాదకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
లేజర్ షో జిగేల్
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అందాలను చూసేందుకు ప్రభుత్వం ప్రతి ఆదివారం సాయంత్రం కేవలం నడక దారినే వస్తున్న వారికే అనుమతిస్తోంది. నడకదారిన వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్యాంక్‌బండ్ పైకి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఆర్మీ బ్యాండ్ కార్యక్రమంతోపాటు లేజర్ షోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
సందర్శకులకు మొక్కల పంపిణీ
టెస్కో హాండ్‌టూమ్ స్టాల్... ఫుడ్ ట్రాక్‌లు సందర్శించిన నగరవాసులు ఏంజయ్ చేశారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాకరంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సండే.. ఫన్ కార్యక్రమాలు హుషారెత్తించాయి. ట్యాంక్‌బండ్ అందాలను తిలకించేందుకు వచ్చిన వారికి హెచ్‌ఎండీఏ అధికారులు మొబైల్ టాయిలెట్స్.. అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు సందర్శకులకు మొక్కలు పంపిణీ చేశారు. ట్యాంక్‌బండ్ రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: NEET: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష