ETV Bharat / city

'స్టెరైన్ గ్యాస్ ప్రమాదరకమైనదే... నివారణ చర్యలు తప్పనిసరి' - మండే స్వభావం ఉన్న స్టెరైన్ గ్యాస్

విశాఖలో విషాదానికి కారణం స్టెరైన్ గ్యాస్. ఇది చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ వాయువు పీల్చితే చర్మంపై మంట, కళ్లల్లో నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస ద్వారా అది శరీరంలోకి వెళితే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు.

స్టెరైన్ గ్యాస్ ప్రమాదరకమైనదే..జాగ్రత్తలు తప్పనిసరి  : నిపుణులు

author img

By

Published : May 7, 2020, 12:50 PM IST

విశాఖలో విషాదానికి కారణమైన స్టెరైన్ రసాయన గ్యాస్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మండే స్వభావం ఉన్న ఈ గ్యాస్‌.. చాలా త్వరగా గాలిలో కలసిపోయి అంతటా కమ్మేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ వాయువును మింగినా, అది కలిసిన గాలిని పీల్చినా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.

చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్లు, కళ్లు ఎర్రబారి నీరు కారటం వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలన్నారు. శ్వాస ద్వారా అది శరీరంలోకి ప్రవేశిస్తే ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఎక్కువ సమయంలో వాయువు ప్రభావానికి లోనైతే మాత్రం శరీరంలోని అవయవాలన్నీ ప్రభావితం అవుతాయన్నారు. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంలోనూ పర్యవసనాలు వెంటాడతాయని పేర్కొన్నారు.

తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్టెరైన్ వాయువు బారిన పడిన వారిని సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ముందుగా గ్యాస్‌ బారినపడిన వ్యక్తి వస్త్రాలను పూర్తిగా తొలగించి... పరిశుభ్రమైన బట్టలతో శరీరాన్ని కప్పి ఉంచి ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలి. అపస్మారక స్థితికి చేరినా... శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

సహాయ చర్యల్లో పాల్గొనే వారు కూడా అన్ని విధాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరి తీసుకోవటం కోసం శ్వాస సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా కలుషిత రసాయనాలు శుద్ధి చేసే వ్యర్థ జలాలు, మురుగునీటి కాల్వలకు చాలా దూరంగా ఉండాలి.

స్టెరైన్ గ్యాస్ ప్రమాదరకమైనదే..జాగ్రత్తలు తప్పనిసరి : నిపుణులు

ఇవీ చూడండి : తొమ్మిది మంది మృతి.. 300 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.