ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. పరీక్షలు నిర్వహిస్తామంటూ తెలంగాణ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతోందని ఎన్ఎస్యూఐ ఆరోపించింది. బీటెక్ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. 50 శాతం ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
వారిని అడ్డుకున్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకపోవడం వల్ల అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది.