హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సమీపంలో శునకాలు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ శునకాలు నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీధి కుక్కల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో వీటికి పరీక్షలు చేయించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. సాయంత్రం వేళల్లో పార్కు సమీపంలో కుక్కలు దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ వెటర్నరీ విభాగం అధికారులు వెంటనే స్పందించి కేబీఆర్ పార్కు సమీపంలోని శునకాలకు పరీక్షలు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి : మొక్కలకూ ఉండాలోయ్ పుట్టినరోజు వేడుకలు!