రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీలోని పన్వర్‌హాలులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు ఓటరు కార్డులోని తప్పులను సరిదిద్దుకునేందకు దీనిని వినియోగించుకోవచ్చని తెలిపారు.
తప్పులను సరిదిద్ధుకునేందుకు గొప్ప అవకాశం..
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత వ్యక్తులు పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు పత్రాలలో ఏదైన ఒకదానితో సంబంధిత ఎన్నికల సిబ్బందిని సంప్రదించవచ్చని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయంలోనూ, డివిజన్ స్థాయిలోనూ, తహసీల్దార్ కార్యాలయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు...
నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్స్ హెల్ప్ మొబైల్ యాప్, కాల్‌సెంటర్ ద్వారా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సంబంధిత మార్పులు చేస్తారని పేర్కొన్నారు.