Minister Gautam Reddy Passes away: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా... ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు.
గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..
మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.. గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్‌రెడ్డి వయస్సు 49 ఏళ్లు.. ఆయన 1971లో జన్మించారు. ఆయన నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు.
గౌతంరెడ్డి.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్నారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1971 నవంబరు 2 జన్మించిన గౌతమ్‌రెడ్డి.. బ్రిటన్‌లో ఎమ్మెస్సీ చదివారు. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. 2019 జూన్ 8న మంత్రిగా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్‌రెడ్డిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు.
ఇదీ చదవండి: