ETV Bharat / city

పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు - పోలింగ్ ఏర్పాట్లు

గ్రేటర్​ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. గడువు తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు.

ప్రచారం గడువు ముగిసింది.. ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు

author img

By

Published : Nov 29, 2020, 7:24 PM IST

Updated : Nov 29, 2020, 8:26 PM IST

పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి వెల్లడించారు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్​ కోసం అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్లు జైలుశిక్ష, జరిమానా విధించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటలకు వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటి వరకు 92.04 శాతం పోలింగ్ చీటీల పంపిణీ పూర్తైనట్టు వెల్లడించారు.

ఐదు చోట్ల ముగ్గురే..

గ్రేటర్​లో 150 డివిజన్లుకు గానూ... 1,122 మంది పోటీ ఉన్నారు. జంగమ్మెట్​ డివిజన్​లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్​సాహెబ్​కుంట, టోలీచౌకి, జీడిమెట్లతో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. తెరాస నుంచి 150 మంది, భాజపా నుంచి 149, కాంగ్రెస్ నుంచి 146, తెదేపా నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సీపీఐ నుంచి 17, సీపీఎం 12, 415 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 74 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా... మైలార్​దేవ్​పల్లి డివిజన్​లో అత్యధికంగా, రామచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు.

కొవిడ్ నిబంధనల మేరకు..

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్​ కొనసాగనున్నట్టు ఎస్​ఈసీ తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్​లు ఉండగా... 2,272 కేంద్రాల్లో లైవ్​ వెబ్​కాస్టింగ్​ నిర్వహిస్తున్నట్టు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు వివరించారు. 661 మంది జోనల్​ అధికారులు పోలింగ్ పర్యవేక్షించనున్నారు. ప్రతి సర్కిల్​కు ఇద్దరు ఫ్లయింగ్​ స్క్వాడ్​ ఉంటారని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల మేరకు... మాస్క్​ ధరించడం, శానిటైజర్​, భౌతికదూరం తప్పనిసరి చేశారు. 1.20 లక్షల పీపీఈ కిట్లు సిద్ధం చేశారు.

ఇప్పటి వరకు కోటి 46 లక్షల నగదు, 500 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని, 99 కేసులు నమోదు చేసినట్టు ఎస్​ఈసీ వివరించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహనా చర్యలు తీసుకోవడంతోపాటు పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించామన్నారు. ఓటు హక్కును నిరోధించకుండా వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సూచించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

Last Updated : Nov 29, 2020, 8:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.