ETV Bharat / city

మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ - జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి హైదరాబాద్ ఎస్ఈసీ కార్యాలయంలో నోటిఫికేసన్ విడుదల చేశారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించి, 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నట్టు స్పష్టం చేశారు. కరోనా నిబంధనల ప్రకారం పోలింగ్, కౌంటింగ్ ఉంటుందని... అవసరమైన సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చినట్టు వివరించారు.

state election commission release notification for ghmc elections
మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
author img

By

Published : Nov 18, 2020, 5:30 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థలో ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వార్డుల వారీగా రిటర్నింగ్ అధికారుల రేపు వార్డు సభ్యుల ఎన్నికకు నోటీసు విడుదల చేయనున్నారు. దీంతో రేపటి నుంచి ఈ నెల 20 వరకు... ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ సారి ఆన్​లైన్​లో కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. కానీ ఆన్​లైన్​లో సమర్పించిన పత్రాలను డౌన్​లోడ్​ చేసుకొని పత్రాలను నేరుగా సంబంధిత ఆర్వోకి అందించాల్సి ఉంటుంది.

ఈ నెల 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. మూడు గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉంటే ఆ ప్రాంతాల్లో డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. అదే రోజు సాయంత్రం వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

బ్యాలెట్​తోనే ఎన్నికలు

అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. గ్రేటర్​లోని మొత్తం 150 వార్డుల వారీగా ఇప్పటికే తుది ఓటర్ల జాబితా సైతం విడుదల చేశారు. మొత్తం 74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది, మహిళలలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669 మంది ఉన్నట్టు వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకారం గ్రేటర్​లో మొత్తం 9,248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 1,439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,004 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 257 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ అధనపు భద్రత కల్పించనున్నట్టు వెల్లడించారు. మెజారీటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ ఎన్నికల్లో బ్యాలెట్​ వినియోగిస్తున్నట్టు తెలిపారు. తెలుపు రంగు బ్యాలెట్​తో పోలింగ్ నిర్వహించనున్నారు.

గత రిజర్వేషన్లే..

కార్పొరేటర్​గా నామినేషన్ వేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్​గా ఎస్​ఈసీ నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు రూ.5 లక్షలుగా నిర్ణయించింది. ఫలితాలు విడుదలైన 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపాలని... ఖర్చులు చూపని అభ్యర్థులపై 3 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. గ్రేటర్​లోని 150స్థానాలకు గతంలో ఉన్న రిజర్వేషన్లే వర్తించనున్నాయి. ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 5, బీసీ జనరల్ 25, బీసీ మహిళ 25, జనరల్ మహిళ 44, అన్​ రిజర్వ్​డ్ 44కు కేటాయించారు.

వారికి కూడా పోస్టల్ బ్యాలెట్

జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు... ఇతర జిల్లాల నుంచి పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు ఎస్​ఈసీ వెల్లడించింది. ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో మొత్తం నలుగురు సిబ్బంది ఉంటారు. మొత్తం 55 వేల వరకు పోలింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. 25 వేల మంది నుంచి 30 వేల మంది వరకు పోలీస్ సిబ్బందితో పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు... వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ-ఓటింగ్​కు కొన్ని ఇబ్బందులు ఉన్నందున... గ్రేటర్ ఎన్నికల్లో ఈ-ఓటింగ్ లేదన్నారు. సాప్ట్​వేర్ అభివృద్ధికి సమయం పట్టడమే కాకుండా... చట్టాన్ని కూడా సవరించాల్సిన అసవరం ఉందన్నారు. ఇక ఉద్యోగులకు ఇచ్చినట్టే వృద్ధులకు, వికలాంగులకు, కరోనా పాజిటివ్ గల వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం ఉందని... త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించనున్నారు.

ఖాతాల్లో వేయవచ్చు..

2009 ఎన్నికల్లో 42.04 శాతం, 2016లో 45.29 శాతం ఓటింగ్ నమోదైంది. కానీ ఈ సారి ఎక్కువగా పోలయ్యేలా ఓటర్లను అవగాహన పరుస్తామని ఎస్ఈసీ ప్రకటించింది. కరోనా నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్, ఫేస్​మాస్క్, సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫాం-ఏ నామినేషన్ల చివరి రోజు వరకు అందించొచ్చని... ఫాం-బీ స్క్రూట్నీ అయిపోయే వరకు సమర్పించొచ్చని స్పష్టం చేశారు. లైసెన్స్ కలిగిన వెపెన్సును సమీప పోలీస్ స్టేషన్​లో డిపాజిట్ చేయాలన్నారు. ప్రతి ఓటరుకు ఖచ్చితంగా పోలింగ్ స్లిప్ అందజేయనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సంఘం వైబ్‌సైట్‌ నుంచి ఓటర్​ స్లిప్ తీసుకోవచ్చని తెలిపారు. ప్రకృతి విపత్తుల విషయంలో ప్రభుత్వ ఆర్థిక సాయం బాధితులకు నేరుగా కాకుండా బ్యాంకు ఖాతాల్లో వేయొచ్చని... ఇదీ ఎన్నికల పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.