ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. 14 న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అదే రోజు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రేపు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పురపాలక ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 12 న మరోసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రుణమాఫీ చేసి, కొత్త రుణాలివ్వండి: జీవన్ రెడ్డి