ఒప్పందం ప్రకారం గడువులోగా ఫ్లాటు అప్పగించకపోవడం సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. పలువురు వినియోగదారులకు ఏలియన్స్ డెవలపర్స్ సంస్థ.. గడువులోగా ఫ్లాట్లు అప్పగించపోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. హైదరాబాద్ తెల్లాపూర్‌లోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్ వన్‌లో గడువు దాటినప్పటికీ ఫ్లాటు అప్పగించలేదంటూ దాఖలైన మూడు ఫిర్యాదులపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పులు వెల్లడించింది.
వినియోగదారులు చెల్లించిన అడ్వాన్సు సొమ్మును 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఏలియన్స్ డెవలపర్స్ సంస్థను, ఎండీ హరి చల్లా, డైరెక్టర్లు సి.వెంకట్ ప్రసన్న, సీవీఆర్ చౌదరి, చల్లా నాగరత్నను కమిషన్ ఆదేశించింది. ముగ్గురు పిటిషనర్లకు ఖర్చుల కింద ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.