రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాస్తోందని రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఆరోపించింది. పౌర ప్రజాస్వామిక వాదులపై పోలీసులు అరెస్టుల పరంపర కోనసాగిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షులు ఆచార్య గడ్డం లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులకు అధికారాలు ఇవ్వడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనకు తమ సంఘం మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ప్రజా చైతన్య యాత్ర జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న నేపథ్యంలో.. ఒక రోజు ముందే తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. వారిని ఎక్కడ పెట్టారో తెలపాలని కోరారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఆపివేసి... ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్: సత్యవతి రాఠోడ్