ETV Bharat / city

ఆమె ఆఫీసుకు వెళ్లాక ఇంట్లోకి వెళ్తున్నాడు.. మర్నాడు పొద్దున బయటికొస్తున్నాడు!! - మహిళ ఇంట్లో నిద్రిస్తున్న దొంగ

ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి.. ఆమె ఆఫీసుకు వెళ్లిపోతోంది. ఆమె వెళ్లిన తర్వాత ఒకడు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. రోజంతా అక్కడే ఉంటున్నాడు.. ఆమె తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఉంటున్నాడు! చివరకు.. రాత్రివేళ సైతం అక్కడే పడుకుంటున్నాడు..!! మర్నాడు ఆమె ఇంటికి తాళం వేసి, ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. బయటకు వస్తున్నాడు..! ఇదీ.. వాడి డైలీ షెడ్యూల్!! కానీ.. ఆమె అతన్ని పసిగట్టలేకపోతోంది.. ఇంతకీ వాడు ఎవడు..? ఎందుకు వెళ్తున్నాడు?? రాత్రి మొత్తం ఆమె ఇంట్లో ఏం చేస్తున్నాడు??

donga
donga
author img

By

Published : Sep 27, 2022, 1:26 PM IST

దాదాపుగా.. ఇది మీరు ఎక్కడా విని ఉండని క్రైమ్ స్టోరీ! కొంత ఆందోళన.. మరెంతో ఉత్కంఠ రేకెత్తించే రియల్ స్టోరీ! కాబట్టి.. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. కథలోకి వెళ్తే.. అమెరికాలోని న్యూ హాంప్​ షైర్ రాష్ట్రం. ఓ మహిళ తన ఇంట్లో ఉంటోంది. రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేది. తలుపులకు పకడ్బందీగా తాళం వేసి మరీ వెళ్లేది. కానీ.. ఆమె బయటకు వెళ్లిన తర్వాత.. 20 ఏళ్ల కుర్రాడు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించేవాడు. కానీ ఎలాంటి చోరీ చేసేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. టీవీ చూసేవాడు. ఇళ్లంతా తిరిగేవాడు. ఇక, ఆఫీస్ నుంచి ఆమె వచ్చేలోపు ఇంట్లో ఓ ప్రాంతానికి వెళ్లిపోయేవాడు. రాత్రంతా అక్కడే ఉండేవాడు. ఆమె.. తన పనులన్నీ చేసుకుంటున్నప్పుడు.. ఇంట్లోనే ఉండి గమనించేవాడు. కానీ.. ఏ మాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేసేవాడు. రాత్రి అక్కడే నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఆమె ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత.. బయటకు వచ్చేవాడు. మళ్లీ అవసరం అనుకుంటే.. సాయంత్రంలోపు ఇంట్లో దూరిపోయేవాడు. లేదంటే.. మరుసటి రోజు వెళ్లేవాడు. ఇంతకీ ఎవరతను..? అసలు అక్కడ ఏం చేస్తున్నాడు?

అతనొక "ప్రేమికుడు". ఆమెను ఎక్కడ చూశాడో.. చూశాడు. కొన్ని నెలల నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. కానీ.. ఆమె గుర్తించలేదు. కొంత కాలం తర్వాత మొత్తానికి ఎదురు పడ్డాడు. తనను పర్సనల్ గా కలవాలని, తనతో డేటింగ్ చేయాలని అడిగాడు. కానీ.. ఆమె "నో" చెప్పింది. అతను వినిపించుకోలేదు. అలాగే వెంటాడుతున్నాడు. పలుమార్లు గట్టిగా చెప్పింది. అయినా.. పద్ధతి మార్చుకోలేదు. దొంగ చాటుగా ఆమెను ఫాలో కావడం మొదలు పెట్టాడు.

ఓ సారి.. న్యూ హాంప్‌షైర్‌కు 400 మైళ్ల దూరంలో ఉన్న ఓ పట్టణానికి వెళ్లింది సదరు మహిళ. ఆ రోడ్ సైడ్ రోమియో.. అక్కడికి కూడా వెళ్లిపోయాడు. అది చూసిన మహిళ అవాక్కైంది. ఎలా వచ్చాడో తెలుకొని మరింత ఆశ్చర్యపోయింది. ఆమె కారు డిక్కీలో పడుకొని వచ్చేశాడు మరి!! కోపగించుకున్న మహిళ.. ఇది సరైన పద్ధతి కాదని, తనను వేధించడం మానుకోవాలని సూచించింది. ఓసారి.. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు వీడియో కాల్ చేశాడు. విసుగ్గా ఫోన్ ఎత్తిన ఆమె.. అతన్ని చూసి నిర్ఘాంతపోయింది. అతను ఉన్న లొకేషన్ ఎక్కడిదోకాదు.. వాళ్ల అమ్మ ఇంటి వద్దనే! అడ్రస్ ఎలా తెలుసుకున్నాడో తెలియదు.. అక్కడికి కూడా వెళ్లిపోయాడు! అక్కడ అతన్ని చూసి హడలిపోయింది సదరు మహిళ. ఇలాంటి పనులు తనకు నచ్చవని.. వెంటనే వెళ్లిపోవాలని చెప్పి, పంపించింది. కానీ.. కొన్ని గంటల తర్వాత ఊహించని షాక్.. మహిళ వాళ్ల అమ్మ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యాడు!

ఆ తర్వాత.. ఆమె తిరిగి న్యూ హాంప్ షైర్ కు వెళ్లిపోయింది. ఆశ్చర్యంగా.. కొన్ని రోజులుగా ఆ "శాడిస్టు ప్రేమికుడు" ఆమెకు కనిపించట్లేదు. ఓ గొడవ వదిలిపోయిందిలే అని ఆమె ప్రశాంతంగా ఆఫీసుకు వెళ్లి వస్తోంది. కానీ.. వాడు ఏకంగా ఆమె ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టాడు. ఈ విషయం తను గుర్తించలేకపోయింది! ప్రేమ గోల లేకుండా ఉన్నానని ఆమె.. ప్రేమికురాలి ఇంట్లోనే ఉంటున్నానని వీడు.. ఇద్దరూ ప్రశాంతంగా కాలం గడిపేస్తున్నారు.

అయితే.. రాత్రివేళ అప్పుడప్పుడూ ఇంట్లో ఏవో సౌండ్లు వినిపించేవి. కానీ.. అవేంటి? అన్నది మాత్రం ఆమెకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఏదో జరుగుతోందనే అనుమానం ఆమెలో మొదలైంది. తన తల్లిని పిలిపించుకుంది. ఆమె కూడా రాత్రివేళ శబ్దాలను పసిగట్టింది. ఇంటి పైభాగం నుంచి ఆ శబ్దాలు వస్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి గాలింపు మొదలు పెట్టారు. అటక మీద నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ యువకున్ని పట్టుకున్నారు. అతన్ని చూసిన ఆ మహిళ ఫ్యూజులు ఎగిరిపోయాయి! ఇన్నాళ్లూ ఇంట్లో శబ్దాలు చేస్తున్నది వీడా..? అంటే.. వీడితో కలిసి నేను ఇన్నాళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నానా..?? రాత్రివేళ కూడా!!!!!

పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో.. నిజాలు కక్కేశాడు. ఓసారి ఆ మహిళ కంట పడకుండా ఇంట్లోకి చొరబడి.. ఇంటి కీస్ కొట్టేశాడు. వాటి డూప్లికేట్ తయారు చేయించాడు. ఇంకేముంది..? ఆమె తాళం వేసుకొని వెళ్లిపోగానే.. వీడు దర్జాగా ప్రవేశించేవాడు. ఆమె వచ్చేంత వరకు ఓనర్ లా ఇళ్లంతా తిరిగేసి.. వచ్చేసిన తర్వాత వెళ్లి అటకపై దాక్కునేవాడు! ఆమె చేసే పనులన్నీ అక్కడే ఉండి గమనించేవాడు. ఫోన్లో.. ఫొటోలు, వీడియోలు కూడా తీసుకునేవాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు మెల్లగా కిందకు దిగి.. పక్కనే కూర్చొని జూమ్ చేసి మరీ ఫొటోలు తీసుకునేవాడు. అలా.. ఆమె నగ్న చిత్రాలు కూడా తీసుకున్నాడు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని జైల్లో తోసేశారు. ఈ ఏడాది మార్చిలో కండీషన్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. మరి, మళ్లీ దొంగ చాటుగా వేధించడని గ్యారంటీ ఏంటీ? ఈ డౌట్ పోలీసులకు కూడా వచ్చింది. అందుకే.. వాడి చేతికి ఓ బ్రాస్​లెట్ బహుమతిగా తొడిగారు. అది ట్రాకింగ్ సిస్టమ్. వాడు ఇంట్లో నుంచి బాత్ రూమ్ కు వెళ్లినా.. ఎన్ని మీటర్ల దూరం కదిలాడో లెక్క కట్టి చెప్పేస్తుంది. దాన్ని ఆపేసినా.. చేతి నుంచి తీసేసినా.. నీ పని ఖతమేరోయ్.. అని హెచ్చరించి వదిలారు.

అందుకే అమ్మాయిలూ.. ఏ గోడ చాటున.. ఏ గబ్బుగాళ్లు ఉన్నారో..?? ఏ కంప్యూటర్ వెనకాల.. ఏ కంపుగాళ్లు ఉన్నారో..?? ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండమ్మా. అసలే ఎదవలు ఎక్కువైపోయారు లోకంలో.. జాగ్రత్త మరి.

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.