ETV Bharat / city

రామానుజ సహస్రాబ్ది సమారోహం.. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తకు ఆకాశమంత గౌరవం - శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరంలో.. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.... 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 2 నుంచి 14 వరకు జరిగే... వివిధ కార్యక్రమాలకు... శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం సిద్ధం కాగా.. చుట్టూ నిర్మించిన 108 ఆలయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటి... ఎటుచూసినా పచ్చదనమే కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు రానున్న నేపథ్యంలో.... పరిసరాల ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నారు.

Srirama nagaram ready to Ramanujacharya millennium celebrations

author img

By

Published : Jan 29, 2022, 7:11 PM IST

రామానుజ సహస్రాబ్ది సమారోహం.. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తకు ఆకాశమంత గౌరవం

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఏర్పాటైంది.... శ్రీరామ నగరం. చిన్నజీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం... వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే... విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవం కల్పించేందుకు సిద్ధమైంది.. ఈ నగరం. వెయ్యేళ్ల క్రితమే... సమజంలోని అందరూ సమానమే అంటూ, ఎక్కువ తక్కువలు లేవంటూ... సమతా భావనను అనుసరించిన మహా పురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు... ప్రయత్నిస్తోంది. రామానుజాచార్యులు కూర్చున్న భంగిమలో 216 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే... ఇందుకు సంబంధించిన చాలా పనులు పూర్తి కాగా... మరికొన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి.

45 ఎకరాల్లో 108 ఆలయాలు..

ముచ్చింతల్‌ ఆశ్రమానికి వెళ్లే మార్గాల్లో.... చాలా దూరం నుంచి రామానుజుల వారి విగ్రహం కనువిందు చేస్తోంది. దగ్గరకు వెళితే.. ఆయన శాంత రూపం, పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమ... భక్తి భావాన్ని, ప్రశాంతతను చేకూర్చోతోంది. ఆశ్రమంలోని ఏ మూల నుంచి చూసినా... అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా రామానుజచార్యులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క విగ్రహమే కాదు... ఏకంగా 108 ఆలయాల్ని కూడా నిర్మించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి రూపునిచ్చారు... చిన్న జీయర్‌ స్వామి.

రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల ఆగమనం..

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం... ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ వేడుకలకు... శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలుగా నామకరణ చేశారు. 2 వారాల పాటు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు.. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా... వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తొలుత.... ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 3వ తేదీన అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు.... చిన్న జీయర్‌ స్వామి. ఫిబ్రవరి 5న సమతా మూర్తి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

ఫిబ్రవరి 14న మహా పూర్ణాహుతి..

ఆ సందర్భంగా నిత్యం హోమాలు జరుగనుండగా, 8న సామూహిక ఆదిత్య హృదయం జపం నిర్వహించనున్నారు. 11న సామూహిక ఉపనయన కార్యక్రమం, 12న సామూహిక విష్ణు సహస్ర నామ జపం ఏర్పాటు చేయనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత కీలమైన.... రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని రామానుజుల భారీ విగ్రహం కింద ఏర్పాటు చేయనున్నారు. దీనిని రూపొందించేందుకు...దాదాపు 120 కిలోల బంగారాన్ని వినియోగించడం విశేషం. ఈ కార్యక్రమంలో కీలక ఘట్టాలు ముగియనుండగా.... ఫిబ్రవరి 14న మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు.

సీఎం కేసీఆరే స్వయంగా సందర్శించి..

దివ్య సాకేతంలో రామానుజుల విగ్రహంతో పాటే... 108 ఆలయాలు నిర్మించారు. వీటిలో శాంతి కల్యాణాలు నిర్వహించనున్నారు... చిన్న జీయర్‌ స్వామి వారు. ఆ తర్వాతనే రామానుజమూర్తి సహా... 108 ఆలయాల సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. ఆశ్రమానికి ప్రముఖులు రాక నేపథ్యంలో.. అన్ని మార్గాల్లో కొత్త రోడ్లు వేస్తున్నారు. ఉన్న వాటిని సరి చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక నగరం.. హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు తెస్తుందని భావిస్తోంది.. తెలంగాణ ప్రభుత్వం. అందుకే... ఈ కార్యక్రమ బాధ్యతల్లో కొన్ని భుజానికెత్తుకుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై... త్రిదండి చినజీయర్‌ స్వామితో చర్చించారు. ఇటీవలే ముచ్చింతల్‌లోని దివ్య సాకేతాన్ని సందర్శించిన ఆయన...ఇక్కడి ఏర్పాట్లుపై అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.