శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల ఏర్పాటు కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన సోదరులు సులవర్ధన్, తిరుమలయ్య, మునిశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. మూఢ నమ్మకాలు, వివాహం కాకపోవడంతో విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు పోలీసులు వివరించారు.
తిరుపతిలో ఈనెల 2న విగ్రహాలు చేయించి.. 6వ తేదీన ఆలయంలో విగ్రహాలు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీ కెమెరా దృశ్యాలు, ద్విచక్రవాహనాల నెంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో సకల సౌకర్యాల కల్పనపై యాడా కసరత్తు