ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నా.. కొందరి తీరు మారకపోవడం వల్ల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. పదే పదే బయటకు వస్తున్న వారి వాహనాలకు ఎరుపు రంగుతో మార్క్ వేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని పెట్రోల్ బంకుల యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. ఇలాగైనా అనవసరంగా బయటకు వచ్చే వారిని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు