ETV Bharat / city

సెజ్ అడ్డం పెట్టుకొని.. కోట్ల రూపాయల వ్యాపారం - శ్రీకృష్ణ జువెలర్స్

హాంకాంగ్ కేంద్రంగా జరిగిన శ్రీకృష్ణ జువెలరీ కుంభకోణంలో రూ. 750 కోట్ల విలువైన బంగారం దారి మళ్లినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 1800 కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్టు డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు.

Sri Krishna jewellers Gold Scam
సెజ్ అడ్డం పెట్టుకొని.. కోట్ల రూపాయల వ్యాపారం
author img

By

Published : Feb 21, 2020, 9:34 AM IST

ప్రత్యేక ఆర్థిక మండలి ముసుగులో జరిగిన బంగారం అక్రమ రవాణా వ్యవహారాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యు ఇంటెలిజెన్స్ అధికారులు చేధించారు. విదేశాల నుంచి వందల కిలోల మేలిమి బంగారాన్ని దిగుమతి చేసుకుని స్థానిక మార్కెట్లలో అమ్మి కోట్లు దండుకున్న బాగోతాన్ని డీఆర్ఐ బయటపెట్టింది. విదేశీ వ్యాపారం, బయటి దేశాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆర్థిక మండలి నిబంధనలు రూపొందించారు.

సెజ్ నిబంధనలు అడ్డుపెట్టుకొని...

2005 ప్రత్యేక ఆర్థిక మండలి నిబంధనల ప్రకారం సెజ్​లో జరిగే లావాదేవీలకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. ఎగుమతి, దిగుమతి సుంకాల్లో మినహాయింపు ఇస్తుంది. సెజ్ పరిధిలో జరిగే వ్యాపార, వాణిజ్య లావాదేవీల మీద ఆధికారుల అజామాయిషీ ఉండదు. ఈ వెసులుబాటును అవకాశంగా తీసుకుని శ్రీకృష్ణ జువెల్లరీ అధినేత ప్రదీప్ కుమార్ రంగారెడ్డి జిల్లా రావిరాల సెజ్ పరిధిలో బంగారం ఎగుమతి, దిగుమతి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోడానికి శ్రీకృష్ణ ఎగ్జిమ్ అనే సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. గత మూడేళ్లుగా.. ఈ సంస్థ పేరుతో విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుని అభరణాలు రూపొందించి తిరిగి విదేశాలకు ఎగుమతి చేసేవాడు.

కిలోల కొద్ది బంగారం.. దొంగచాటుగా..

రావిరాల సెజ్ నుంచి బంగారం అక్రమంగా దారి మళ్లుతుందని సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు నిఘా పెంచారు. గతేడాది మే 3న సిద్ధి అంబర్ బజార్ దగ్గర శ్రీకృష్ణ జువెలర్స్ సెక్యూరిటీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరి నుంచి పది కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కెట్ల మీద ఉన్న మార్కులను, సీరియల్ నెంబర్లను చెరిపేసి తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని విచారిస్తే.. మరిన్ని వివరాలు తెలిశాయి. ఆ వివరాల ఆధారంగా శ్రీకృష్ణ జువెలర్స్ ఎగ్జిమ్ సంస్థ మీద రావిరాల డీఆర్ఐ అధికారులు దాడులు చేశారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న పార్శిల్​ను తనిఖీ చేయగా రూ. 5.45 కోట్ల విలువైన బంగారం, రంగురాళ్లు బయటపడ్డాయి. పార్శిల్ తనిఖీ చేసిన క్రమంలో 21 కిలోల రంగురాళ్లు, 565 గ్రాముల బంగారం దొరికింది. పూర్తి స్థాయిలో సోదాలు చేసిన అధికారులకు మొత్తం 51.5 కిలోల బంగారం, రూ.2.92 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.31 కిలోల విలువైన వజ్రాలు రూ.2.24 రాళ్లు దొరికాయి. వాటితో పాటు కొంత నగదు కూడా దొరికింది. స్పాట్​లో ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సునీల్ అనే వ్యక్తి కోసం ఇన్నాళ్లు వెతికారు. తాజాగా సునీల్ తమిళనాడులో దొరికాడు. అతడిని అరెస్టు చేసి.. జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

బంగారం కుంభకోణం గురించి లోతుగా ఆరా తీస్తున్న డీఆర్ఐ అధికారులు ఈ వ్యవహారమంతా.. హాంకాంగ్ కేంద్రంగా జరిగినట్టు గుర్తించారు. అక్కడ వ్యాపార సంస్థ పెట్టి.. అక్కడి నుంచి బంగారం తెప్పించి స్థానిక మార్కెట్లో అమ్ముకుంటున్న వైనం బయటపడింది. సెజ్ నిబంధనలు అడ్డు పెట్టుకొని బంగారు ఆభరణాలు ఎగుమతి చేశారు. లెక్కల్లో మాత్రం తక్కువ శాతం బంగారం, ఎక్కువ శాతం రాళ్లు పంపుతున్నట్టు చూపారు. 2017 నుంచి 2019 వరకు లెక్కలన్నీ పరిశీలించిన అధికారులు దాదాపు రూ.750 కోట్ల విలువైన 1800 కిలోల బంగారం దిగుమతి చేసుకున్నట్టు తేలింది. హాంకాంగ్​తో పాటు ఇక్కడ కూడా ప్రదీప్​కు చెందిన కంపెనీలోనే లావాదేవీలు జరగడంతో అధికారులు జువెలరీ సంస్థ బ్యాంకు లావాదేవీలు స్తంభింపజేశారు. ప్రదీప్ ద్వారా జరిగే లావాదేవీల మీద నిఘా పెట్టారు. ఈ సంస్థ చేసిన బంగారం కుంభకోణం వల్ల ప్రభుత్వానికి రూ.70 కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. చట్ట విరుద్ధమైన లావాదేవీలు జరిగినట్టు నిరూపణ అయితే.. కేసును ఎన్​ఫోర్సుమెంటు డైరెక్టరేట్ (ఈడీ) తీసుకుని దర్యాప్తు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.