రాష్ట్ర ప్రత్యేక రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ తేజ్‌దీప్ కౌర్ తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సర్కిల్ వద్ద కనిపించిన ముప్పై మంది వలస కార్మికులకు సాంబారు, అన్నం అందించి వారి ఆకలి తీర్చారు. వలస కార్మికులు, పేదలకు సాయం చేయడం మన కర్తవ్యం అని, ప్రతీ ఒక్కరు చేతనైనంత సాయం చేయాలని అన్నారు. అదే సమయంలో కరోనా హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న బాలుడిని అభినందించారు.
ఇవీ చూడండి: దివ్యాంగ న్యాయవాదిని చావబాదిన ఎస్సైపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు