ETV Bharat / city

స్త్రీల పాలిట శాపంగా కన్యత్వ పరీక్షలు.. ఇంకెన్నాళ్లీ అరాచకం? - వధువుల పాలిట శాపంగా కన్యత్వ పరీక్ష

శృంగారం.. ఇది భార్యాభర్తల వ్యక్తిగత విషయం.. నాలుగ్గోడలకే పరిమితం! కానీ అమ్మాయిల కన్యత్వానికి సంబంధించి ఇప్పటికీ కొన్నిచోట్ల ఉన్న వివిధ మూఢనమ్మకాలు, ఆడవారిపై వివక్ష మొదలైన కారణాల వల్ల గోప్యంగా ఉండాల్సిన ఈ విషయం కాస్తా రచ్చకెక్కుతోంది. తప్పు లేకపోయినా అమ్మాయి తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి దుస్థితే ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఓ వధువు పాలిట శాపమైంది.

virginity tests for brides still prevalent

author img

By

Published : Sep 20, 2022, 2:29 PM IST

కొన్ని వందల ఏళ్ల కింద మొదలైన అనాగరిక పరీక్షలు కొంతమంది అమాయక స్త్రీల పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పచ్చు. వారి హక్కులకు, వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్‌లో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం తనపై అత్యాచారం చేశాడన్నా పట్టించుకోకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడో అబ్బాయి. అలాగని అది ఆదర్శ వివాహం అనుకుంటే పొరబడినట్లే! అసలు విషయం తెలిసినా పెళ్లైన తొలిరాత్రే వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు ఆమె అత్తింటి వారు. అందులో విఫలమైన ఆమెను చిత్రహింసలు పెట్టడమే కాదు.. పంచాయతీకి లాగి పదిమందిలోనూ నిలబెట్టారు. అలా ఆమె పరువు తీయడమే కాదు.. నష్ట పరిహారం చెల్లించమని గ్రామ పెద్దలు తీర్పు ఇవ్వడం శోచనీయం.

ఈ క్రమంలో మన దేశంలోని కొన్ని మారుమూల గ్రామాలు, తెగల్లో ఇప్పటికీ కన్యత్వ పరీక్షల పేరుతో వధువు పరువు మంటగలుస్తోందంటున్నాయి పలు అధ్యయనాలు. అసలు ఇంతకీ ఏంటీ కన్యత్వ పరీక్షలు? అన్ని రంగాల్లోనూ స్త్రీలు దూసుకుపోతోన్న ఈ కాలంలోనూ ఆడవారిపై ఈ అనాగరిక చర్యలేంటి? ఇవి మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రండి.. తెలుసుకుందాం..!

.

అత్యాచారం జరిగిందని చెప్పినా.. పెళ్లయ్యాక అమ్మాయికి అత్తారిల్లే పుట్టిల్లు. అత్తమామలే తల్లిదండ్రులు. ఈ నమ్మకంతోనే మెట్టినింట్లో అడుగుపెట్టింది రాజస్థాన్‌ భిల్వారా జిల్లా సన్సీ అనే తెగకు చెందిన ఓ అమ్మాయి. అయితే పెళ్లికి ముందే తనపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడని తనకు కాబోయే అత్తగారితో చెప్పినా.. ఆదర్శ కుటుంబంలా ఆమెను కోడలిని చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇలా వాళ్ల మంచితనం చూసి మురిసిపోయిన వధువుకు తొలిరాత్రి నుంచి వేధింపులు మొదలయ్యాయి. నిజానికి ఆ తెగలో కన్యత్వ పరీక్షలు చాలా సహజం. శోభనం రాత్రి ఆ పరీక్షలో విఫలమైన ఆ వధువును భర్త, అత్తింటి వారు కొట్టడం, నిత్యం హింసించడంతో.. ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిందామె. దీంతో ఆ గ్రామ పెద్దలు ఆ అమ్మాయిని పంచాయతీకి పిలిచి.. తనదే తప్పని తీర్పిచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని ముందే తన అత్తింటి వారికి చెప్పానని ఆమె వాపోయినా.. వినిపించుకోకుండా వధువు కుటుంబాన్ని వరుడి కుటుంబానికి రూ. 10 లక్షల జరిమానా చెల్లించమనడం గమనార్హం. ఇక్కడ వరుడి తండ్రి హెడ్ కానిస్టేబుల్‌ కావడం, తన కోడలిపై జరిగిన అఘాయిత్యం గురించి ముందే తెలిసినా నోరు మెదపకపోవడం కొసమెరుపు. ఈ ఒక్క సంఘటన చాలు.. సన్సీ తెగలో నవ వధువులు, కోడళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పడానికి!

అసలేంటీ కన్యత్వ పరీక్ష.. కన్యత్వ పరీక్ష.. మహిళ పెళ్లికి ముందే ఇతరులతో శారీరక సంబంధం కలిగి ఉందో, లేదో తెలుసుకోవడానికి పెట్టే పరీక్ష ఇది! రాజస్థాన్‌లోని సన్సీ తెగలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. ‘కుకడీ ప్రాథా వేడుక’గా పిలిచే ఈ పరీక్షలో భాగంగా.. తొలిరాత్రి వధువుకు తన భర్తతో కలిసినప్పుడు కన్నె పొర చిరిగిపోయి బ్లీడింగ్‌ జరగాలి. దాన్ని గుర్తించడానికి వారి మంచంపై తెల్లటి బెడ్‌షీట్‌ని పరుస్తారు. దానిపై రక్తపు మరకలు పడితే ఆమె కన్య అని, లేదంటే పతితగా ఆమెపై ముద్ర వేస్తారు. అంతేకాదు.. ఆ మహిళ కన్య కాదని తెలిస్తే అత్తింటి వారి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వధువు కుటుంబం వరుడి కుటుంబానికి కొంత నగదు పరిహారం కూడా చెల్లించాల్సి రావచ్చు.

.

అక్కడి వధువులకు ‘అగ్నిపరీక్ష’!.. అయితే ఇలా సన్సీ తెగలోనే కాదు.. రాజస్థాన్‌ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన కంజర్‌భాత్‌ తెగలోనూ వధువు కన్యత్వాన్ని పరీక్షించడానికి అచ్చం ఇలాంటి ఆచారాన్నే పాటిస్తున్నారు. ఈ రెండు చోట్లనే కాదు.. దేశంలోని కొన్ని మారుమూల గ్రామాలు/తెగల్లో వివిధ పేర్లతో ఇలాంటి పరీక్షలు నేటికీ జరుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

పానీ కీ ధీజ్ : దేశంలో వివిధ రాష్ట్రాల్లోని కొన్ని తెగల్లో ‘పానీ కీ ధీజ్‌’ పేరుతో కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఒక వ్యక్తి వంద అడుగులు వేయాలి. అలా అడుగులు వేయడం పూర్తయ్యేవరకు వధువు నీటిలో మునిగి అంతసేపూ ఊపిరి బిగబట్టి ఉండాలి. ఇలా ఉంటే సరే సరి.. లేదంటే మాత్రం అత్తింటి వారి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కోక తప్పదు.

అగ్నిపరీక్ష : మరికొన్ని చోట్ల నిప్పుతో చెలగాటమాడుతూ ఈ కన్యత్వ పరీక్షను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వధువు తన అరచేతిలో నిప్పుల కుంపటిని పట్టుకొని కాసేపు ఉండాలి. నిర్దేశిత సమయం పాటు కుంపటిని తన చేతిలో ఉంచుకుంటే ఆమె కన్య అని, లేదంటే పతిత అంటూ ఆమెపై ముద్ర వేస్తారు. అంతేకాదు.. ఆమె కన్య కాదని తెలిస్తే తన శృంగార భాగస్వామి ఎవరనేది అందరి ముందు చెప్పాల్సి ఉంటుంది.

.

కుక్రీ కా రసమ్ : ఈ పరీక్ష కూడా రాజస్థాన్‌లోని సన్సీ తెగలో నిర్వహించే ‘కుకడీ ప్రాథా వేడుక’లాగే ఉంటుంది. కొన్ని తెగల్లో ‘కుక్రీ కా రసమ్‌’ పేరుతో కన్యత్వ పరీక్షను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శోభనం గదిలోని మంచంపై ఒక తెలుపు రంగు దారం లేదా షీట్‌ను పరుస్తారు. మరుసటి రోజు ఉదయం ఆ షీట్‌పై రక్తపు మరకలు పడితే ఆమెను కన్యగా భావిస్తారు. ఇందులోనూ కొన్ని చోట్ల బంధువులు, కుటుంబ సభ్యులు.. గది బయట నిలబడి తెల్లవారే దాకా వేచి చూడడం గమనార్హం!

వీటితో పాటు మరికొన్ని చోట్ల రెండు చేతి వేళ్లను ఉపయోగించి కన్యత్వ పరీక్ష జరుపుతున్నారు. ‘టూ ఫింగర్ టెస్ట్‌’గా పిలిచే ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో అత్యాచార బాధితులను పరీక్షించడానికి వినియోగించేవారు. కానీ ఆ తర్వాత దీన్ని అశాస్త్రీయమైనదిగా భావించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పరీక్షను రద్దు చేసింది. అయినా వధువుకు కన్యత్వ పరీక్ష చేయడానికి దేశంలోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ అశాస్త్రీయమైన మూఢనమ్మకాన్ని పాటించడం గమనార్హం!

‘కన్య’ కాదని తేలితే..? ఇలా కన్యత్వ పరీక్షలో పాసైతే సరే సరి.. లేదంటే వధువు తమ శృంగార భాగస్వామి గురించి బహిర్గతం చేయడం, అత్తింటి వారికి జరిమానా చెల్లించడం.. వంటివి చేస్తూ తాను అపవిత్రురాలినని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబం సమస్యను పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లాలి. అక్కడా వధువు తన కన్యత్వాన్ని పరీక్షించుకోవడానికి మరో అవకాశమిస్తారు. అందుకూ నిరాకరిస్తే వారిని/వారి కుటుంబాన్ని ఆ తెగ నుంచి బహిష్కరించడానికీ వెనకాడరట!

.

ఇంకెన్నాళ్లీ అరాచకం.. కొన్ని వందల ఏళ్ల కింద మొదలైన ఈ అనాగరిక పరీక్షలు కొంతమంది అమాయక స్త్రీల పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పచ్చు. వారి హక్కులకు, వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది యువత వీటిపై చేస్తోన్న పోరాట ఫలితంగా ఈ కేసులు నానాటికీ తగ్గుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. అయినా ఇప్పటికీ కొన్నిచోట్ల వివిధ మూఢనమ్మకాలనే పట్టుకుని వేళ్లాడే ప్రజలు ఈ ఆచారాన్ని వదులుకోవడానికి ఆసక్తి చూపట్లేదట! ఏదేమైనా.. ఇలాంటి అనైతిక పరీక్షలు మహిళలు/బాలికల హక్కుల్ని కాలరాస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఇవి ఆయా మహిళల్లో యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి.. వంటి దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతున్నాయని సంస్థ పేర్కొంది. అంతేకాదు.. కొంతమంది మహిళలు ‘పరువు’ పేరుతో ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యకు గురికావడం.. వంటివీ అక్కడక్కడా జరగడం విచారకరం! అందుకే ఈ మూఢాచారాల్ని సాధ్యమైనంత త్వరగా ఈ సమాజం నుంచి తరిమేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.