ETV Bharat / city

DSC-2008: 'డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌'

డీఎస్సీ-2008 బాధితులకు న్యాయం చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 2,190 మందికి ఎస్‌జీటీ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. 12 ఏళ్లు పోరాటం చేసిన వారికి న్యాయం చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ చేపడతామని చెప్పారు. 2018 డీఎస్సీ పెండింగ్ పోస్టులనూ భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

'డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌'

author img

By

Published : Jun 11, 2021, 7:37 PM IST

డీఎస్సీ-2008 బాధితులైన 2,190 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగ్​లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వీరికోసం ప్రత్యేక రిక్రూట్​మెంట్ చేపడతామని తెలిపారు. మినిమమ్ టైమ్ స్కేల్లో పని చేయడానికి డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారని వివరించారు. 2018 డీఎస్సీలో పోస్టుల భర్తీలో భాగంగా 486 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. 2018 డీఎస్సీకి సంబంధించి 387 పోస్టులు పెండింగ్​లో ఉంటాయని, వాటినీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఏపీ టెట్-2021 సిలబస్ సిద్ధం చేసి http://aptet.apcfss.in/ వెబ్​సైట్​లో పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.

ఇదీ చదవండి: 20 ఏళ్లు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తారా: తరుణ్​ చుగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.