ETV Bharat / city

రేపు బంద్​కు మావోయిస్టుల పిలుపు.. మన్యంలో జల్లెడ పడుతున్న జవాన్లు

జులై 1న మావోయిస్టులు బంద్​కు పిలుపు నేపథ్యంలో ఏపీలోని విశాఖ మన్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈనెల 16న ఏవోబీలోని తీగలమెట్ట ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతికి నిరసనగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో సీఆర్‌పీఎఫ్ జవాన్​లు.. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆరా తీస్తున్నారు.

Maoist calls for strike
Maoist calls for strike
author img

By

Published : Jun 30, 2021, 6:22 PM IST

జూన్ 16వ తేదీన ఏవోబీలోని తీగలమెట్ట వద్ద జరిగిన ఎన్​కౌంటర్​ను ఖండిస్తూ జులై ఒకటో తేదీన జోన్ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో వాహనాల తనిఖీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్​ల పరిధిలోని అన్ని గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. ఓ పక్క బంద్.. మరోపక్క పోలీసుల తనిఖీలు..మన్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని గిరిజనులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు.

సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యటన..

మ‌న్యంలో సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు అద‌న‌పు డీజీ ర‌ష్మీ శుక్లా, ఐజీ మ‌హేశ్‌ చంద్ర లడ్డా నేతృత్వంలో అధికారుల మంగళవారం పర్యటించారు. మావోయిస్టులు జులై 1న బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నవ‌రం, చింత‌ప‌ల్లి, జి.మాడుగులలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుల‌ను పరిశీలించారు. మన్యంలోని పరిస్థితులపై జవాన్లతో సమీక్షించిన ఉన్నతాధికారులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

ఆరుగురు మావోయిస్టులు మృతి..

జూన్​ 16న తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొంత మంది మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎదురుకాల్పులు అనంత‌రం.. విశాఖ‌-తూర్పు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు స్థావ‌రాలపై నిఘా పెంచారు. గ‌త నెల‌లో పాల‌స‌ముద్రం వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల ఘ‌ట‌న నుంచి మావోయిస్టులు త‌ప్పించుకున్న‌ప్ప‌టికీ.. అక్క‌డ ల‌భించిన స‌మాచారం తీగలమెట్ట వద్ద మావోలను అంతమొందించి విజయం సాధించారు. తాజాగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదీచూడండి: ఫోన్ గురించి గొడవ- చెల్లిని నరికి చంపిన అన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.