All India Performance Shields : దక్షిణ మధ్య రైల్వే 2021 సంవత్సరానికి రెండు ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్స్ సాధించింది. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ప్రదర్శించిన ఉత్తమ పనితీరుకు ఈ గుర్తింపు లభించింది. జోన్ స్టోర్స్ షీల్డ్, సివిల్ ఇంజినీరింగ్ రంగాల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించి రెండు షీల్డులు అందుకుంది.
-
SCR Bags Two National Performance Efficiency Shields – 2021 @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmvijayawada @drmgnt @drmned pic.twitter.com/cBWpDchWgU
— South Central Railway (@SCRailwayIndia) December 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">SCR Bags Two National Performance Efficiency Shields – 2021 @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmvijayawada @drmgnt @drmned pic.twitter.com/cBWpDchWgU
— South Central Railway (@SCRailwayIndia) December 31, 2021SCR Bags Two National Performance Efficiency Shields – 2021 @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmvijayawada @drmgnt @drmned pic.twitter.com/cBWpDchWgU
— South Central Railway (@SCRailwayIndia) December 31, 2021
స్క్రాప్ తొలగించడంలో మార్గదర్శకం..
All India Performance Shields For Southern Central Railway : రెండు అఖిల భారత పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్స్ సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అభినందించారు. జోన్ పరిధిలో మరింత అభివృద్ధి కోసం నూతన రంగాలపై, పద్ధతులపై దృష్టి పెట్టాలని బృందానికి జనరల్ మేనేజర్ సూచించారు. దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ తొలగించడంలో మార్గదర్శకంగా ఉందని, ప్రధాన స్క్రాప్ డిపోలు.. లాలాగూడ, రాయనపాడు, తిరుపతి వద్ద సజావుగా స్క్రాప్ తొలగించిందని జీఎం తెలిపారు. భారతీయ రైల్వేలోని అన్ని జోన్లలో దక్షిణ మధ్య రైల్వే తక్కువ టర్నోవర్ నిష్పత్తి సాధించి రికార్డు నమోదు చేసిందని రైల్వే శాఖ వెల్లడించింది.