ETV Bharat / city

Trains : ఇక నుంచి ప్యాసింజర్‌.. ఎక్స్‌ప్రెస్‌లా పరుగు! - demu and memu trains to be speed up

కరోనా వల్ల రద్దయిన రైలు సర్వీసులు(Trains) ఈనెల 19 నుంచి పునరుద్ధరించనున్నారు. గతంలో తక్కువ వేగంతో ప్రయాణించే.. డెము, మెము రైళ్లను వేగంగా పరిగెత్తించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ట్రాక్​ మెరుగుపడటం వల్ల ఇక నుంచి ఈ రైళ్లు వేగంగా పరిగెత్తనున్నాయి.

ప్యాసింజర్‌.. ఎక్స్‌ప్రెస్‌లా పరుగు!
ప్యాసింజర్‌.. ఎక్స్‌ప్రెస్‌లా పరుగు!
author img

By

Published : Jul 18, 2021, 7:37 AM IST

కరోనాతో రద్దయిన రైళ్లు(Trains).. ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. గతంలో తిరిగిన రైళ్ల(Trains) స్థానే.. కొత్త నంబర్లతో రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటిలో.. డెము, మెము ప్యాసింజర్లు ఇక నుంచి వేగంగా పరుగెత్తనున్నాయి. వాటిని కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగంతో నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

వేగం పెరగనుంది..

గతంలో ఇవి తక్కువ వేగంతో ప్రయాణించేవి. టికెట్‌ ధర తక్కువ అయినా.. అధిక సమయం ప్రయాణంతో విసుగుపుట్టేది. ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీగా పునరుద్ధరించనున్న అన్‌ రిజర్వుడ్‌ ప్యాసింజర్‌ రైళ్ల (Trains)వేగాన్ని పెంచుతున్నట్లు ద.మ.రైల్వే శనివారం ప్రకటించింది.

82 సర్వీసుల పునరుద్ధరణ..

‘ట్రాక్‌ల పటిష్ఠానికి రైల్వే శాఖ గతేడాది అనేక పనులు చేపట్టింది. దీంతో జోన్‌ నెట్‌వర్క్‌లోని వివిధ సెక్షన్ల పరిధిలో రైళ్లు వీలైనంత వేగంతో ప్రయాణించే అవకాశం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌ మెరుగుపడటంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. అన్‌ రిజర్వుడ్‌ ప్యాసింజర్లను అన్‌ రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా నడిపేందుకు వీలు కలిగింది. రద్దయిన 82 సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నాం’ అని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

కౌంటర్లు, యాప్‌లో టికెట్లు

ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లతో పాటు మొబైల్‌ ఫోన్‌లో యూటీఎస్‌ యాప్‌, స్టేషన్లలో ఏటీవీఎం(ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌), సీవోటీవీఎం(కాయిన్‌/క్యాష్‌ ఆపరేటెడ్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌)లో కూడా టికెట్లు తీసుకోవచ్చని ద.మ.రైల్వే తెలిపింది. కొవిడ్‌ దృష్ట్యా కౌంటర్ల దగ్గర రద్దీ లేకుండా యూటీఎస్‌ యాప్‌, ఏటీవీఎం, సీవోటీవీఎంలు వినియోగించుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి : Trains : కరోనాతో రద్దయిన 82 రైళ్ల పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.