కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వేకు అనేక సవాళ్లు ఎదురైనా... వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మరో అత్యుత్తమమైన మైలు రాయిని దాటింది. 2021-22 సంవత్సరంలో సరకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల లోడిరగ్ నిర్వహించింది. దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరకుల లోడిరగ్ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లోనూ సరకు రవాణాలో వృద్ధి సాధించింది.
గత ఆర్థిక సంవత్సరం 2020-21తో పోలిస్తే సరకు రవాణాలో 17.7 శాతం అధిక ఆదాయాన్ని, 17.3 శాతం అధిక లోడిరగ్‌ను సాధించింది. సరకు రవాణా లోడిరగ్ పురోగతిలో బొగ్గు 53.78 ఎమ్‌టీల లోడిరగ్‌తో, సిమెంట్ 32.339 ఎమ్‌టీ, ఆహార ధాన్యాలు 7.980 ఎమ్‌టీ, ఎరువులు 5.925 ఎమ్‌టీ, కంటైనర్ల సేవలు 2.137 ఎమ్‌టీ, స్టీల్ ప్లాంట్ల కోసం ముడిసరకు 4.14 ఎమ్‌టీ, అల్మూనియా పౌడర్, ఫ్లైయాష్, గ్రానైట్, చెక్కర మొదలైనవి 5.80 ఎమ్‌టీల లోడిరగ్‌లో భాగస్వామ్యమయ్యాయి.
సరకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం, పలు స్టేషన్ల మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా సరకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలతో ఆదాయం,లోడిరగ్ వృద్ధి సాధించడానికి తోడ్పడినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. దీనికి అదనంగా డివిజనల్, జోనల్ స్థాయిల్లో నూతనంగా ఏర్పాటుచేసిన బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు యూనిట్లు జోనల్ సరకు రవాణాలో అభివృద్ధికి దోహదపడినట్లు అధికారులు తెలిపారు.
ఇదీచూడండి: Attack on Excise SI: ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్‌పై మందుబాబుల దాడి