ఆంధ్రప్రదేెశ్లో ప్రచార ఆర్భాటం ఎక్కువైందని.. ఉద్యోగ క్యాలెండర్‌పై ఆ రాష్ట్ర సీఎం చెప్పిందొకటి చేసేది మరొకటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గ భేటీలో భాజపా నేతలు సోము, కన్నా, సునీల్ దేవ్‌ధర్ పాల్గొన్నారు.
ఎక్సైజ్ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నీటి కేటాయింపులో తెలంగాణ వివాదాలు సృష్టిస్తోందని విమర్శించారు. జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం దీటుగా స్పందించాలని కోరారు. అన్ని పార్టీలు, నిపుణులతో చర్చించి పోరాడాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ