ETV Bharat / city

snakes kalakalam: బైక్​లో పాము.. తీసేందుకు కర్రలతో సాము..! - tirumala latest news

ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరులో ఓ ద్విచక్ర వాహనంలో పాము కలకలం రేపింది. ఆ పామును బయటకు రప్పించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. చివరికి పెట్రోల్ ట్యాంక్.. ఇతర భాగాలను విడదీసి మరీ పామును బయటికి తీయాల్సి వచ్చింది.

ద్విచక్ర వాహనంలో పాము కలకలం
ద్విచక్ర వాహనంలో పాము కలకలం
author img

By

Published : Jul 15, 2021, 7:09 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనంలో దూరిన పాము కలకలం రేపింది. ఆ సర్పాన్ని బయటకు రప్పించేందుకు బైకు యజమాని నానా తంటాలు పడ్డారు. వాహనం పెట్రోల్ ట్యాంక్, తదితర భాగాలను వేరుచేయాల్సి వచ్చింది. ఓ వ్యక్తి పాము తోక పట్టుకుని బయటకు లాగగా.. సగభాగం తెగిపోయింది. ఆ తర్వాత బైకులోపల మిగిలిన భాగాన్నీ బయటకు లాగి కర్రలతో కొట్టి చంపేశారు.

ఓ ద్విచక్ర వాహనంలో పాము కలకలం

తిరుమలలో కొండచిలువ హల్​చల్..

తిరుమల మెట్ల మార్గంలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఏడో మైలు వద్ద బుసలు కొడుతూ భక్తుల కంటపడింది. పట్టుకునేందుకు ప్రయత్నించగా తిరగబడింది. దుకాణం వద్దనున్న టేబుల్‌ను కరుచుకుంది. చాలా సేపటి తర్వాత కొండచిలువను పట్టుకుని..అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

తిరుమలలో కొండచిలువ హల్​చల్​

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.