ETV Bharat / city

నేతన్నకు మద్దతుగా ప్రభుత్వాధికారులు.. ట్విటర్​ ట్రెండింగ్​లో ఛాలెంజ్​లు.. - trending

Handloom EveryDay Challenge: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్​ మీడియాలో నేతన్నకు పూర్తి మద్దతు లభిస్తోంది. అటు సాధారణ ప్రజల నుంచి ఇటు ప్రజాప్రతినిధులే కాకుండా ప్రభుత్వ అధికారులు సైతం నేతన్నకు అండగా నిలబడుతూ.. తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఛాలెంజ్​లు కూడా ట్రెండింగ్​లో ఉన్నాయి. ఆ ఛాలెంజ్​ కథేంటో మీరూ తెలుసుకోండి..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 7, 2022, 6:28 PM IST

Handloom EveryDay Challenge: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్​ మీడియాలో "హ్యాండ్​లూమ్​ ఎవ్రీడే(#Handloom #EveryDay) ఛాలెంజ్​" ట్రెండింగ్​లో ఉంది. ఈ ఛాలెంజ్​ను ఎవరో సినీతారలో, క్రీడాకారులో విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే.. ఈ సవాలును రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు విసురుకుంటున్నారు. అయితే.. ఈ ఛాలెంజ్​కు శ్రీకారం చుట్టింది మాత్రం.. "తెలంగాణ ట్రెండీ వేర్​కు బ్రాండ్​"గా ఉన్న సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్​. సాధారణంగానే.. చేనేత వస్త్రాలకు ప్రత్యేకతనిస్తూ నిత్యం వాటినే ధరించే స్మిత సబర్వాల్​.. తోటి అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో పోస్టు చేస్తూ.. హ్యాండ్​లూమ్​ పరిశ్రమకు తనదైన రీతిలో ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు స్మిత సబర్వాల్​. అయితే.. తానే కాకుండా తోటి అధికార వర్గమంతటినీ కూడా చేనేతకు ఆదరణ కల్పించటంలో భాగస్వామ్యం చేయాలనుకున్న స్మిత సబర్వాల్​.. ఓ ట్రెండీ ఆలోచన చేశారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నిన్ననే చేనేత చీరతో ఉన్న ఫోటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసి.. ప్రతి రోజు చేనేత వస్త్రాలు ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాని ప్రకటించారు. అంతేకాకుండా.. ఈ ప్రతిజ్ఞలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐపీఎస్ అధికారిణి షికాగోయల్​ తదితరులను కూడా భాగస్వామ్యం చేశారు. అద్భుత కళాకారులైన నేత కార్మికలను ప్రోత్సహించేందుకు గానూ.. చేనేత దుస్తులు ధరించినప్పటి వాళ్లకు ఇష్టమైన ఫొటోను పోస్టు చేయాలని కోరారు.

ఈ సవాలును స్వీకరించిన.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. పోచంపల్లి దుస్తులు ధరించిన ఫొటోను ట్వీట్ చేశారు. చిన్నప్పటి నుంచి తన తల్లి పోచంపల్లి దుస్తులు ధరిస్తున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు వెంకటేశ్​, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్​కు ట్యాగ్ చేసి ఈ ఛాలెంజ్​ను ముందుకు తీసుకెళ్లాలని సీపీ ఛాలెంజ్ విసిరారు. చేనేత దుస్తులకు డిమాండ్ తగ్గినందుకు బాధగా ఉందన్న సీపీ.. ప్రభుత్వం ఆలోచించి బతుకమ్మ వంటి పండుగలకు ప్రత్యేక ఆర్డర్లు ఇస్తుందన్నారు. వారి కోసం భవిష్యత్తులో చేనేత దుస్తులు ధరించాలని కోరారు.

  • Always felt sad about declining demand for handloom stuff and the future of these weavers till the TS govt gave them special orders for Bathukamma etc. Will wear more of them in future and I tag @pvsindhu1 @vvslaxman281 and Actor @venkymama to take forward this handloom movement pic.twitter.com/Z8NiEYO2yM

    — C.V.ANAND, IPS (@CPHydCity) August 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన సవాలును సీవీ ఆనంద్​ స్వీకరించటం పట్ల స్పందించిన స్మితా సబర్వాల్.. తాను ఇచ్చిన ఉదాహరణ చాలా దూరం వెళ్తుందని తెలిపారు. స్మిత సబర్వాల్ ఛాలెంజ్​ను స్వీకరిచిన షికాగోయల్, జయేష్ రంజన్ కూడా తమ వ్యక్తిగత ఖాతాల్లో చేనేత దుస్తులు ధరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. ఇంకేముంది.. ఈ సవాలు కాస్తా ట్విటర్​లో ట్రెండిగ్​గా మారింది. అధికారులే కాకుండా.. వాళ్లను అనుసరిస్తోన్న చాలా మంది కూడా ఇందులో పాల్గొంటూ.. చేనేతకు అండగా ఉన్నామని మద్దతు తెలుపుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.