ETV Bharat / city

సీలేరులో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు - Slight earthquakes in Visakhapatnam

విశాఖ మన్యం సీలేరులో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్వల్పంగా భూప్రకంపనలు రావడం వల్ల భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Earthquakes in Sealer
సీలేరులో భూప్రకంపనలు
author img

By

Published : Nov 21, 2020, 2:19 PM IST

విశాఖ మన్యం సీలేరులో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు.. బయటికి పరుగులు తీశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సీలేరులో భూమి కంపించింది. అదే సమయంలో పెద్దగా శబ్దం రావడం.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఏం జరిగిందా అని అనుకునే లోపే.. ప్రకంపనలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్​ఈ , జెన్కో అపార్ట్మెంట్ల వద్ద ప్రకంపనల శబ్దాలు పెద్దగా వినిపించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సీలేరులో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.